: కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రిగా సినీ నటి?


కన్నడ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత లోక్ సభలో ఎంపీగా కూడా వ్యవహరించిన సినీ నటి రమ్య ఇప్పుడు ఆరోగ్యమంత్రి కానున్నారని సమాచారం. కన్నడ కాంగ్రెస్ అంతర్గత సమాచారం ప్రకారం సినీ నటుడు, ఆరోగ్య శాఖ మంత్రి అంబరీష్ ను తొలగించి, ఆయన స్థానంలో రమ్యను ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించాలని అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది. గత ఏడాది అనారోగ్యం బారిన పడడానికి ముందు కన్నడ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సినీ నటుడు అంబరీష్ ను వైద్యం నిమిత్తం సింగపూర్ తరలించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యానికి అయిన కోటిన్నర ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. అప్పటి నుంచి ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మధ్య ఆయనపై పార్టీ నేతలు బహిరంగ విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలను అదుపు చేసేందుకు రమ్యను మంత్రిగా చేయాలని అధిష్ఠానం ఆదేశించినట్టు తెలుస్తోంది. లోక్ సభ, అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం లేని రమ్యను మంత్రిగా చేసి ఎమ్మెల్సీగా ఎన్నుకోనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News