: ముంబైలో 440 కోట్ల విలువ చేసే పప్పు ధాన్యాలు స్వాధీనం
ముంబైలో అక్రమంగా నిల్వ చేసిన 440 కోట్ల రూపాయల విలువ చేసే పప్పు ధాన్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటడంతో గిడ్డంగుల్లో అక్రమ నిల్వలపై దృష్టిపెట్టిన అధికారులు గత కొంత కాలంగా దాడులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 19 నుంచి ముంబై, థానేలలో ఉన్న 27 గిడ్డంగులపై నిర్వహించిన దాడుల్లో అక్రమంగా నిల్వ చేసిన 440 కోట్ల రూపాయల విలువైన 61.250 మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను స్వాధీనం చేసుకున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో 18 గిడ్డంగుల యజమానులపై చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.