: 192 మంది చిన్నారులు, 138 మంది మహిళల్ని కాపాడిన నైజీరియా సైన్యం


బోకోహరం ఉగ్రవాదుల చెరలో బందీలుగా దుర్భర జీవితం అనుభవిస్తున్న 330 నైజీరియన్లను సైన్యం విడిపించింది. నైజీరియాలో బోకోహరం తీవ్రవాదుల అరాచకాలకు అంతులేదన్నది అందరికీ తెలిసిందే. ఊళ్లపై విరుచుకుపడి పురుషులను అంత్యంత పాశవికంగా హత్య చేసి, స్త్రీలపై లైంగిక దాడులకు పాల్పడి, పిల్లలను బానిసలుగా మార్చేస్తారని బోకోహరం తీవ్రవాదులపై తీవ్ర ఆరోపణలున్నాయి. తాజాగా సాంబిసా అటవీ ప్రాంతంలో బోకోహరం తీవ్రవాదుల స్థావరంపై దాడులు చేసిన నైజీరియా సైన్యం 30 మంది తీవ్రవాదులను హతమార్చి వారి వద్ద బందీలుగా ఉన్న 192 మంది చిన్నారులు, 138 మంది మహిళలకు విముక్తి కల్పించింది.

  • Loading...

More Telugu News