: అందుకే అమిత్ మిశ్రాపై కేసు ఉపసంహరించుకోలేదు!: వందనా జైన్
టీమిండియా బౌలర్ అమిత్ మిశ్రా వ్యవహార శైలి కారణంగానే అతనిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోలేదని అతని స్నేహితురాలు, సినీ నిర్మాత వందనా జైన్ తెలిపారు. బెంగళూరులో మిశ్రాపై కేసు విషయంలో వివరణ ఇస్తూ, తాను పెట్టిన కేసు గురించి అమిత్ మిశ్రా ఏమీ పట్టించుకోలేదని అన్నారు. కేసును ఉపసంహరించుకోవాలని భావించిన తాను, దీనిని అతనేమీ పట్టించుకోకపోవడంతో ఆశ్చర్యపోయానని, దీంతో కేసును అలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపింది. ఇప్పుడు కేసు పోలీసులు, కోర్టు ముందు ఉందని, కేసును ఏం చేయాలో వారే తేలుస్తారని వందనా జైన్ చెప్పింది. కాగా, దీనిపై అమిత్ మిశ్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు గంటలపాటు విచారించి స్టేషన్ బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.