: పవన్ కల్యాణ్ 'జనసేన' పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంది: ఎన్నికల కమిషన్


ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకుందని తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రత్యేక గుర్తులేని రాజకీయ పార్టీగా జనసేన గుర్తింపు పొందిందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతో, తన రాజకీయ ప్రస్థానంలో పవన్ కల్యాణ్ జాగ్రత్తగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. పార్టీని రిజిస్టర్ చేయడం ద్వారా భవిష్యత్ రాజకీయాల్లో జనసేన కీలకంగా మారనుందనే సంకేతాలు పంపారు. ఎలక్షన్ కమిషన్ ప్రకటనతో పవన్ కల్యాణ్ రాజకీయ కదలికలపై అనుమానం వ్యక్తం చేసిన వారికి ఓ క్లారిటీ లభించింది. 2019లో జరగనున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పోటీ చేస్తుందని, భవిష్యత్ లో ఆ పార్టీ కీలకంగా మారనుందని సంకేతాలను పంపింది. దీనిపై జనసేన కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News