: నవంబర్ 1 నుంచి ఏపీలో హెల్మెట్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ ఒకటి నుంచి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ నే ధరించాలని స్పష్టం చేశారు. మొదటిసారి నిబంధన ఉల్లంఘనకు పాల్పడితే రూ.100 జరిమానా విధిస్తామని చెప్పారు. రెండోసారి ఉల్లంఘిస్తే బైక్ సీజ్ చేసి, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. జనవరి నుంచి అన్ని సేవలకు ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాలని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.