: అమితాబ్ నోట తెలుగు మాటలు
అమితాబ్ బచ్చన్ నోట తెలుగు మాటలకు కొత్తేముంది అనుకుంటున్నారా? గతంలో ఒకట్రెండు సినిమాల్లో దర్శకుల సూచనల మేరకు కొన్ని తెలుగు మాటలు మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనంతట ఆయనే తెలుగులో మాట్లాడడం విశేషం. సోషల్ మీడియాలో అమితాబ్ చాలా చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అభిమానులను సోషల్ మీడియా ద్వారా నేరుగా పలకరించే అమితాబ్ ను ఓ వ్యక్తి మీకు తెలుగు తెలుసా? అని అడిగారు. కొంత అర్థమవుతుందని, తెలుగులో మంచి స్నేహుతులు ఉన్నారని ఇంగ్లీషులో సమాధానం చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి ఎలా ఉన్నారు? అని అడిగారు. 'ఎలా ఉన్నానా? బాగున్నాను' అని సమాధానం చెప్పారు. వెంటనే 'ఎలా ఉన్నారు? అంటే హౌ ఆర్ యూ? అనే కదా?' అని ఎదురు ప్రశ్నించారు. ఈ ఆసక్తికర ఈ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.