: కేరళ భవన్ పై దాడిని ఖండిస్తున్నాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఢిల్లీలోని కేరళ భవన్ లో గోమాంసం అమ్ముతున్నారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే అక్కడ తనిఖీలు చేసిన ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. ఆ దాడిని ఖండిస్తున్నామని కరీంనగర్ లో చెప్పారు. లౌకిక దేశం భారత లో ఆహార అలవాట్ల పేరిట దాడులు సరికాదని చెప్పారు. కాగా, ప్రధాని మోదీ మెప్పుకోసమే సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఏలో చేరేందుకు కూడా ఆయన తహతహలాడుతున్నారని విమర్శించారు.