: 5 రూపాయల భోజనాన్ని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా తింటున్నారు: జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్
హైదరాబాదులోని లక్డీకాపూల్ రెడ్ హిల్స్ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు రూపాయలకే భోజనం సదుపాయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు రూపాయల భోజన పథకం ద్వారా రోజుకు 15,000 మంది హైదరాబాదీలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. పేద ప్రజలే కాకుండా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా ఈ ఐదు రూపాయల భోజన సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. కాగా, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో తమిళనాడు ప్రభుత్వం తరహాలో ఎంపిక చేసిన చోట్ల కేవలం ఐదు రూపాయలకే భోజన సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.