: అక్కడ స్త్రీ, పురుష రచయితలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే కొరడా దెబ్బలే!
సంప్రదాయ ఇరాన్ దేశంలో రచయితలకు కష్టకాలం వచ్చిపడింది. అణచివేత ధోరణిలో ఆ దేశ కోర్టులు ఇచ్చే తీర్పులతో వీరు బెంబేలెత్తిపోతున్నారు. ఈ దేశంలో స్త్రీ, పురుష రచయితలు షేక్ హ్యాండ్ ఇచ్చిపుచ్చుకుంటే కొరడా దెబ్బల శిక్ష విధిస్తూ భయపెట్టేస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయితలు ఫాతిమా ఏక్తేశ్వరి, మోహిదీ మౌసావి జంటకు ఇరాన్ కోర్టు ఇటువంటి కఠిన శిక్షే విధించింది. మిగతా కవులతో కరచాలనం చేసినందుకుగాను వారిద్దరికీ 99 కొరడా దెబ్బలు అమలు చేయాలని ఆదేశించింది. గతేడాది 30 మంది పాత్రికేయులకు కూడా ఇరాన్ ప్రభుత్వం ఇలాంటి శిక్షే అమలు చేసింది. దేశాధ్యక్షుడు హసన్ రొహానీ పాలనలో రచయితలపై దాడులు అధికమయ్యాయని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.