: చంద్రబాబును కలిసిన ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో వీరి సమావేశం జరిగింది. అనంతరం శ్రీనివాసన్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తనను ఆహ్వానించారని తెలిపారు. మర్యాద పూర్వకంగానే చంద్రబాబును కలిశానని చెప్పారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీని తెలిపారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.