: అత్యాచారానికి సరైన శిక్ష అదేనా?


దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాలంటే దోషులకు క్యాస్ట్రేషనే సరైన శిక్ష అని ఓ కేసును విచారించిన సందర్భంగా మద్రాసు న్యాయస్ధానం అభిప్రాయపడింది. నిర్భయ ఘటన వెలుగు చూసిన నాటినుంచి క్యాస్ట్రేషన్ (బీజకోశాలను కత్తిరించడం లేదా నపుంసకులుగా మార్చడం) చేయడమే సరైన శిక్ష అనే నినాదం మొదలైంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ నినాదం మరుగునపడిపోయింది. తాజాగా మద్రాసు హైకోర్టు క్యాస్ట్రేషన్ పై వ్యాఖ్యానించడంతో మరోసారి దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నిజంగా అత్యాచారాలను అడ్డుకోవాలంటే క్యాస్ట్రేషనే సరైన శిక్ష అని ఎక్కువ మంది అభిప్రాయపడుతుండగా, క్షణికావేశంలో చేసిన తప్పుకు అంత పెద్ద శిక్ష అవసరమా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అత్యాచారానికి క్యాస్ట్రేషన్ శిక్షను పలు దేశాల్లో విధిస్తున్నారు. క్యాస్ట్రేషన్ అంటే వీర్యాన్ని, పురుషాంగాన్ని ప్రేరేపించే గ్రంధులను పని చేయనీయకుండా చేయడమే. దీనిని రెండు రకాలుగా చేస్తారు. ఒకటి ఆపరేషన్ నిర్వహించి బీజకోశాలు తొలగించడం. రెండో రకంలో ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి రసాయనాలు పంపి ఆ గ్రంధులు స్పందించడం మానేసేలా చేస్తారు. దీంతో నపుంసకత్వం సంభవించి భవిష్యత్తులో అత్యాచారం లాంటి తప్పుడు పనులకు పాల్పడరు. మరి మన దేశంలో అత్యాచారాలకు క్యాస్ట్రేషన్ లాంటి శిక్షల అమలు జరుగుతుందా? అందుకు భారత శిక్షాస్మృతిని సవరించడం వీలవుతుందా?

  • Loading...

More Telugu News