: రాష్ట్రం మొత్తం కరవుతో అల్లాడుతుంటే... 196 మండలాలనే ప్రకటిస్తారా?: వైకాపా
తెలుగుదేశం ప్రభుత్వంపై వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కరవుతో అల్లాడుతుంటే... కేవలం 196 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడమేంటని ఆమె ప్రశ్నించారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని అన్నారు. లక్షలాది ఎకరాల పచ్చటి పొలాలు బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే కరవుపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు. వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి, కరవుపై చర్చించాలని డిమాండ్ చేశారు.