: రాష్ట్ర అభివృద్ధి కోసమే కేసీఆర్ ను కలిశా: గుండు సుధారాణి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని టీటీడీపీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి కితాబిచ్చారు. ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను అభినందించడానికే ఆయనను కలిశానని చెప్పారు. కేసీఆర్ ను ఢిల్లీలో ఈ రోజు సుధారాణి కలిసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. వరంగల్ ను స్మార్ట్ సిటీగా ప్రకటించినందున కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపానని సుధారాణి చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ అభివృద్ధే ముఖ్యమని అన్నారు. టీఆర్ఎస్ లో చేరుతున్నారా? అన్న ప్రశ్నకు, 'మీరే చూస్తారుగా' అని ఆమె సమాధానమిచ్చారు.