: అమరావతి వెళ్లొచ్చిన తర్వాత మారిపోయిన కేసీఆర్...కేంద్రంలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు!: పొంగులేటి కామెంట్
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లి వచ్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ లో స్పష్టమైన మార్పు వచ్చిందని టీ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆన్నారు. అమరావతి వెళ్లివచ్చిన తర్వాత కేసీఆర్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని కూడా ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారులో టీఆర్ఎస్ చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి శంకుస్థాపన వేదికపై పోలవరం ప్రాజెక్టును ప్రస్తావిస్తే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడులకు కోపం వస్తుందని కేసీఆర్ భయపడ్డారని కూడా పొంగులేటి వ్యాఖ్యానించారు.