: ఇక ఫ్లిప్ కార్ట్ స్టోర్లు...ఆఫ్ లైన్ విక్రయాల దిశగా ఈ-కామర్స్ జెయింట్ సన్నాహాలు


ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్... రంగప్రవేశం చేసే దాకా ఏ వస్తువు కావాలన్నా, నేరుగా ఆయా కంపెనీల షోరూంలకు వెళ్లి సదరు ఉత్పత్తులను నిశితంగా పరిశీలించి కొనుగోలు చేసేవాళ్లం. ఫ్లిప్ కార్ట్ తరహా ఈ-కామర్స్ సంస్థల ఎంట్రీతో వినియోగదారుల కొనుగోలు స్వరూపం రూపురేఖలే మారిపోయాయి. ఇంటివద్దే కూర్చుని ఆర్డర్లు ఇవ్వడం, వాటిని ఇంటి వద్దే తీసుకోవడం మొదలైంది. ప్రస్తుతం షోరూంలకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది. పండుగ సీజన్లు వచ్చాయంటే ఆయా ఈ-కామర్స్ వెబ్ సైట్లు క్రాష్ అయిపోయేంతగా రద్దీ నెలకొంటోంది. ఈ తరహా వ్యాపారంలో ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సహా ఈ-కామర్స్ సంస్థల అధినేతలు అతి స్వల్ప కాలంలోనే కోట్లకు పడగలెత్తారు. అయితే ఆన్ లైన్ విక్రయాలతో అంతగా సంతృప్తి చెందని వినియోగదారులు ఇంకా ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు ఫ్లిప్ కార్ట్ ‘ఆఫ్ లైన్’ విక్రయాలకు తెరలేపుతోంది. ఈ విధానం కింద సదరు సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ప్రత్యేకంగా స్టోర్లను ఏర్పాటు చేస్తుంది. ఈ స్టోర్లను సందర్శించే వినియోగదారులు ఆయా విభాగాల వారీగా ప్రదర్శనకు పెట్టిన వస్తువులను పరిశీలించి అక్కడికక్కడే ఆర్డర్లు చేయవచ్చు. అక్కడికక్కడే వస్తువులను వినియోగదారులు తమ వెంటే తీసుకెళ్లే వెసులుబాటును కూడా ఫ్లిప్ కార్ట్ కల్పిస్తుందట. మరి ఈ తరహా వ్యాపారానికి ఏమాత్రం ఆదరణ లభిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News