: 'మై బ్రిక్-మై అమరావతి'కి ప్రజల నుంచి భారీ స్పందన
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మై బ్రిక్ -మై అమరావతి' వెబ్ సైట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 34 లక్షల 99వేల 623 ఇటుకలు అమ్ముడయ్యాయి. 53,460 మంది ఈ ఇటుకలను కొనుగోలు చేశారు. ఆన్ లైన్ బ్రిక్స్ కొనుగోలు ద్వారా రూ.3,49,96,230 సొమ్ము వచ్చింది. ఇక 'మై బ్రిక్-మై అమరావతి' వెబ్ సైట్ ను ఇంతవరకూ 11,34,384 మంది సందర్శించారు.