: ముందు జాగ్రత్త కోసమే వెళ్లాం... దాడి చేయలేదు: ఢిల్లీ పోలీస్ కమిషనర్
తాము కేరళ హౌస్ పై దాడి చేయలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ స్పష్టం చేశారు. కేరళ హౌస్ లో బీఫ్ వండి వడ్డిస్తున్నట్టు తమకు ఫోన్ కాల్ రావడంతో తమ సిబ్బంది అక్కడకు వెళ్లారని తెలిపారు. మతపరమైన గొడవలు జరగకుండా ఉండేందుకే ఈ పని చేశామని... అంతేకాని అక్కడ ఎలాంటి దాడి చేయలేదని చెప్పారు. పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన విష్ణు గుప్తా అనే వ్యక్తి ఇప్పటికే పోలీసుల నిఘాలో ఉన్నాడని తెలిపారు. తమకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు విష్ణు గుప్తాపై సెక్షన్ 182 కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు.