: కేటీఆర్ తో భేటీ అయిన సురేష్ బాబు, ఇతర సినీ ప్రముఖులు


స్టార్ హీరోలు, అందాల ముద్దుగుమ్మలు, పేరు మోసిన బ్యానర్లు, టాప్ డైరెక్టర్లు, ఎంతో మంది టెక్నీషియన్లు, కోట్లాది రూపాయల బడ్జెట్, అభిమానుల అంచనాలు... సినిమా హిట్ కావడానికి ఇలా ఎన్నో అంశాలున్నా కేవలం ఒకే ఒకటి ఆ సినిమాను చంపేస్తోంది. అదే పైరసీ భూతం. సినిమా విడుదలైన మరుసటి రోజే సినిమాకు సంబంధించిన సీడీలను రోడ్ల పక్కన అమ్మేస్తున్నారు. ఇంటర్నెట్ పుణ్యమా అని నెట్టింట్లో సినిమా అందుబాటులోకి వస్తోంది. దీంతో, పెద్ద సినిమాలు సైతం బొక్కబోర్లా పడుతున్నాయి. స్టార్ హీరోలు సైతం లోలోపల మథనపడటం తప్ప, ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీఎస్ మంత్రి కేటీఆర్ తో ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుతో పాటు పలువురు సినీ పెద్దలు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమను మింగేస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టాలని ఈ సందర్భంగా వారు కేటీఆర్ ను కోరారు. పైరసీ వల్ల ఇండస్ట్రీ ఎలా నష్టపోతోందో మంత్రికి వారు వివరించారు. దీనికి సమాధానంగా, పైరసీని అరికట్టడానికి ప్రభుత్వం తరపున పూర్తిగా సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News