: రౌడీయిజానికి దమ్ము కావాలి కాని... రైతులతో మాట్లాడటానికి ఎందుకు?: ఏపీ మంత్రి నారాయణ
దమ్ము, ధైర్యం ఉంటే అమరావతిలో భూసేకరణకు నోటీసులు ఇవ్వాలని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. రౌడీయిజం చేయడానికి దమ్ము, ధైర్యం ఉండాలి కాని రైతులతో మాట్లాడటానికి ఎందుకు? అని నారాయణ అన్నారు. రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములను సేకరించడం లేదని చెప్పారు. రైతులతో మాట్లాడే తాము భూసేకరణ చేస్తున్నామని తెలిపారు. భూసేకరణకు నోటీసులు ఇస్తే... అక్కడకు వెళ్లి రైతులను రెచ్చగొట్టాలని వైకాపా నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తక్కువ ఖర్చే చేశామని తెలిపారు.