: నేను ఎవరికీ భయపడటం లేదు... ఇండోనేసియా పోలీసుల విచారణలో చోటా రాజన్
పోలీసులకు పట్టుబడ్డ మాఫియా డాన్ చోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఎవరికీ భయపడటం లేదని వ్యాఖ్యానించాడు. మూడు రోజుల క్రితం ఆస్ట్రేలియా నగరం సిడ్నీ నుంచి బాలికి పయనమైన చోటా రాజన్ ను బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ అదుపులోని చోటా రాజన్ ను ఇండోనేసియా పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. మాఫియా సామ్రాజ్య విస్తరణకు సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు రాబడుతున్నారు. ఈ క్రమంలో పోలీసుల విచారణకు బాగానే సహకరిస్తున్న చోటా రాజన్, తాను ఎవరికి భయపడటం లేదని పేర్కొన్నాడు. విచారణకు సంబంధించిన సంచలన విషయాలు మరికాసేపట్లో వెలుగుచూసే అవకాశాలున్నాయి.