: అరుణ్ శౌరి ఇకపై మా పార్టీ సభ్యుడు కాడు: బీజేపీ
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్ శౌరికి బీజేపీ ఉద్వాసన పలికింది. ఎన్డీయే ప్రభుత్వంపైన, ప్రధాని మోదీపైన ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. అయితే ఇటీవలి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ సమయంలో ఆయన తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోలేదు. దాంతో శౌరి ఇకపై తమ పార్టీ సభ్యుడు కాడని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఆరు సంవత్సరాలకోసారి ప్రతి సభ్యుడు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలి. కానీ శౌరి అలా చేయలేదని చెప్పారు.