: ముంబైలో కాల్పుల కలకలం... శివసేన నేతకు బుల్లెట్ గాయాలు
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నేటి ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు శివసేన నేత అనిల్ చౌహాన్ పై కాల్పులకు తెగబడ్డారు. నగరంలోని కాశ్మీరియా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో అనిల్ చౌహాన్ తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన అనిల్ చౌహాన్ ను ఆయన అనుచరులు హుటాహుటిన భక్తివేదాంత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనపై ఫిర్యాదునందుకున్న ముంబై పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు.