: మాడాకు చిరు నివాళి... అల్లు అరవింద్, ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూడా!
టాలీవుడ్ హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి నేటి ఉదయం నివాళి అర్పించారు. మాడా గృహానికి వెళ్లిన చిరంజీవి ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. మాడా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చిరంజీవి వెంట ఆయన బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూడా మాడా భౌతికకాయానికి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నేడు మాడాకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.