: ఏపీలో విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను సింగిల్ డిజిట్ కు తగ్గించాలి: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించే విషయంపై సీఎం చంద్రబాబు ట్రాన్స్ కో, ఇన్ క్యాప్ అధికారులతో ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫైబర్ గ్రిడ్ ను విజయవంతం చేయాలని అధికారులను కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టం 10.37 శాతం ఉందని, దానిని సింగిల్ డిజిట్ కు తగ్గించేందుకు కృషి చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరా, పంపిణీలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News