: విశాఖలో అపార్ట్ మెంట్ ఎక్కిన ‘ప్రేమ’...దింపేందుకు తంటాలు పడుతున్న ఫైర్ సిబ్బంది
ఏపీ వాణిజ్య రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నంలో ‘ప్రేమ’ డిమాండ్ అపార్ట్ మెంట్ ఎక్కింది. తాను ప్రేమించిన యువతితో పెళ్లి జరిపించకుంటే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ నగరంలోని అబిద్ నగర్ లో అజయ్ అనే యువకుడు అపార్ట్ మెంట్ ఎక్కాడు. భవనం చాలా ఎత్తు ఉండటంతో ఎక్కడ అజయ్ కిందకు దూకుతాడోనన్న ఆందోళనలతో అక్కడి ప్రజలు వెనువెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది కిందకు దిగాలని అజయ్ ను వేడుకుంటున్నారు. అయితే ఫైర్ సిబ్బంది విన్నపాన్ని అజయ్ ఖాతరు చేయడం లేదు. తాను ప్రేమించిన యువతితో పెళ్లి జరిపిస్తామని హామీ ఇస్తేనే కిందకు దిగుతానని, లేకపోతే దూకి చనిపోతానని హెచ్చరిస్తున్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.