: ఇక దావూద్ పనిబడతాం: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి రిజిజు


20 ఏళ్ల పాటు భారత్ ను మూడు చెరువుల నీళ్లు తాగించిన మాఫియా డాన్ చోటా రాజన్ కు ఎట్టకేలకు సంకెళ్లు పడ్డాయి. ఇండోనేసియా నగరం బాలిలో ఆ దేశ పోలీసులు రాజన్ కు బేడీలు వేసినా, ఈ ఆపరేషన్ లో భారత నిఘా వర్గాలు, ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ లు కీలక భూమిక పోషించారు. రాజన్ ను పట్టేశామన్న ఉత్సాహంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పుడు ఓ కీలక ప్రకటన చేశారు. ఇక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పని కూడా పడతామని ఆయన పేర్కొన్నారు. పాక్ లో దాక్కున్న దావూద్ ఆటలు కట్టించి భారత్ తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సహకారంతో దావూద్ పాక్ లోనే తలదాచుకుంటున్నాడని కూడా రిజిజు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News