: భారత్-పాక్ సరిహద్దుల్లో రూ.120 కోట్ల హెరాయిన్ స్వాధీనం
పంజాబ్ లోని భారత్- పాక్ సరిహద్దు వద్ద అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ ను భద్రతాదళ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలింగ్ లో భాగంగా బీఎస్ఎఫ్ అధికారులు బహదుర్కర్, ఫిరోజ్ పూర్ లోని గట్టిహయల్ అవుట్ పోస్ట్ ల వద్దకు వెళ్లారు. బహదుర్కర్ అవుట్ పోస్ట్ వద్ద 22 కిలోలు, గట్టిహయల్ అవుట్ పోస్ట్ వద్ద 2 కిలోల హెరాయిన్ ను అక్రమంగా తరలిస్తుండటాన్ని గమనించారు. వెంటనే ఆ మొత్తం హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.120 కోట్ల వరకు ఉంటుందని భద్రతాదళ అధికారులు పేర్కొన్నారు.