: ఏపీలో కరవు మండలాలు 196


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ స్థాయిలో వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సకాలంలో పంటపొలాలకు నీరందక బీళ్లుగా మారాయి. కొన్ని చోట్ల నాట్లు కూడా పడలేదు. దీంతో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కరవు మండలాల నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 196 మండలాలు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. కర్నూలులో 40, అనంతపురంలో 39, చిత్తూరులో 39, కడపలో 33, ప్రకాశంలో 21, నెల్లూరులో 14, శ్రీకాకుళంలో 10 కరవు మండలాలను గుర్తించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News