: ఇండో-చైనా సరిహద్దుల్లో పహారాకు మహిళా భద్రతా బలగాలు


పురుషులతో దీటుగా మహిళా భద్రతా సిబ్బంది సరిహద్దుల్లో విధులు నిర్వర్తించనున్నారు. ఇండో-చైనా సరిహద్దు వెంబడి సుశిక్షితులైన మహిళా భద్రతా సిబ్బంది వచ్చే ఏడాది ప్రథమార్థంలో మొదటిసారిగా పహారా కాయనుంది. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)కు చెందిన దాదాపు 500 మంది మహిళా భద్రతా బలగాలు చైనా సరిహద్దు వెంబడి భద్రతను పర్యవేక్షించనున్నాయి. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ కృష్ణా చౌదరి తెలిపారు.

  • Loading...

More Telugu News