: అక్రమ పప్పు ధాన్యాల నిల్వలు భారీగా స్వాధీనం
దేశ వ్యాప్తంగా పప్పు ధాన్యాల అక్రమ నిల్వలపై అధికారులు దాడులు నిర్వహించారు. 12 రాష్ట్రాల్లో 8,394 చోట్ల అధికారులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 82 వేల టన్నుల పప్పు ధాన్యాల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మరో వారం రోజుల్లో ఈ నిల్వలను తిరిగి రిటైల్ మార్కెట్లకు తరలిస్తామని ఈ సందర్భంగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నిల్వలను రిటైల్ మార్కెట్లకు తరలించడం ద్వారా వాటి ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం మంగళవారం నాటి కందిపప్పు, మినపప్పు ధరలు... కందిపప్పు కేజీ ధర రూ.210 నుంచి రూ.190కి, మినప్పప్పు కేజీ ధర రూ.190 నుంచి రూ.180 కి తగ్గాయి. హోల్ సేల్ గా కందిపప్పు కిలో ధర రూ.181గా ఉంది.