: మా పెళ్లి రోజు బాగా జరుపుకున్నాం: హీరో నాని
ప్రముఖ హీరో నాని, భార్య అంజనా తమ మూడో మ్యారేజ్ డేని ఘనంగా జరుపుకున్నారు. ఈ విషయాన్ని నాని స్వయంగా తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అభిమానులకు తెలిపారు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి దిగిన ఫొటోలను నాని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. కాగా, నాని హీరోగా ఇటీవల విడుదలైన 'భలేభలే మగాడివోయ్' చిత్రం విజయవంతమైంది. విజయోత్సాహంతో ఉన్న నాని తన పెళ్లివేడుకలను ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు.