: ఫిర్యాదు చేసినంత మాత్రాన ఆలోచించకుండా వెళ్లిపోవడమేనా?: కేజ్రీవాల్
కేరళ భవన్ లో గొడ్డుమాంసం వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. గొడ్డు మాంసం విక్రయిస్తున్నారని భజరంగ్ దళ్ కు చెందిన కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేయగానే తనిఖీలకు ఎలా వెళ్తారని ఆయన అడిగారు. కేరళ భవన్ అంటే ఒక రాష్ట్రానికి చెందిన అతిథి గృహమని ఆయన చెప్పారు. అది హోటల్ కాదని, అలాగే బీఫ్ అమ్మే దుకాణం కాదని అంతా తెలుసుకోవాలని ఆయన సూచించారు. కేవలం బీజేపీ వల్లే లేనిపోని వివాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహం మాని విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన హితవు పలికారు. కేరళీయుల ఆందోళనకు ఆయన మద్దతు పలికారు.