: అదేమన్నా హోటలా?...మాకు నచ్చిన మాంసం తింటాం: కేరళ సీఎం
కేరళ భవన్ లో గొడ్డుమాంసం వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. గొడ్డు మాంసం విక్రయిస్తున్నారని భజరంగ్ దళ్ కు చెందిన కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏం తినాలో చెప్పడానికి మీరెవరంటూ నిలదీస్తున్నారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేరళ భవన్ హోటల్ కాదని స్పష్టం చేశారు. కేరళ భవన్ ప్రజాప్రతినిధులు ఉండే గెస్ట్ హౌస్ అని అన్నారు. గెస్టు హౌస్ లో ఏం తినాలో, ఏం తినకూడదో చెప్పడానికి మీరెవరు? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలో ఉన్నామా? అని నేరుగా కేంద్రాన్ని నిలదీశారు. ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నది పోలీసులా? లేకా బీజేపీ కార్యకర్తలా? అని అడిగారు. హద్దులు మీరితే చేతులు ముడుచుకుని కూర్చోమని కేరళీయులు హెచ్చరించారు.