: ఒకే కన్నుతో వింత శిశువు జననం


ఒకే ఒక కన్నుతో వింత శిశువు ఒకటి ఈజిప్ట్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించింది. నుదుటి మధ్య భాగంలో ఈ కన్ను ఉంది. శిశువు ముఖంలో ఒక కన్ను, పెదవులు, చెవులు మాత్రమే ఉన్నాయి. ఈ వింత శిశువుకు ముక్కు, కనురెప్పలు కూడా లేకుండా పలు వైకల్యాలతో జన్మించింది. ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలోనే వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ వింత శిశువు గురించి వైద్యులు మాట్లాడుతూ, గర్భధారణ సమయంలో శిశువు తల్లి రేడియేషన్ ప్రభావానికి గురికావడం వల్లే.. పలు వైకల్యాలతో శిశువు జన్మించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ విధంగా వింత శిశువులు జన్మించడాన్ని వైద్య పరిభాషలో సైక్లోపీడియా అంటారని వైద్యులు చెప్పారు.

  • Loading...

More Telugu News