: మల్కాపురంలో చెరకు తోటను వైసీపీ నేతలే తగులబెట్టారు: పంచుమర్తి అనురాధ


గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురంలో చెరకు తోట తగులబడిన విషయంలో వైసీపీపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. చెరకు తోటను వైసీపీ నేతలే తగులబెట్టారని ఆమె ఆరోపించారు. చెరకు తోటను వారే తగులబెట్టి, తిరిగి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె విమర్శించారు. శంకుస్థాపనకు వచ్చిన ప్రజల మద్దతు చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News