: వీవీ వినాయక్ ప్రశంసల వర్షం కురిపించారు: యువ నటుడు వరుణ్ తేజ్
'కంచె' సినిమాలోని అభినయానికి గాను యంగ్ హీరో వరుణ్ తేజ్ పై దర్శకుడు వీవీ వినాయక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విషయం గురించి వరుణ్ చెబుతూ, ‘చాలా ప్రత్యేకమైన వ్యక్తి, ప్రముఖ దర్శకుడు వివి నాయక్ నాకు ఫోన్ చేశారు. కంచె చిత్రం దర్శకుడు క్రిష్ పైన, నాపైన ఆయన ప్రశంసల వర్షం కురిపించారు’ అంటూ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. వినాయక్ అలా ఫోన్ చేసి ప్రశంసించడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ యువనటుడు పేర్కొన్నాడు.