: టీటీడీ పాలకమండలి నిర్ణయాలు... హైదరాబాద్ లో శ్రీవారికి ఆలయం


ఇవాళ జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పాలకమండలి సమావేశం జరిగింది. * హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో రూ.13.89 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. * శ్రీవారి ఆర్జిత సేవలు, అద్దె గదులు, శ్రీవారి లడ్డూ ధరల పెంపుపై ఉపసంఘం ఏర్పాటు చేశారు. వచ్చే సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని ఉపసంఘాన్ని ఆదేశించారు. * తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర అరబిందో నేత్రాలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే కంటి ఆసుపత్రికి 6 ఎకరాల స్థలం కేటాయిస్తూ తీర్మానం చేశారు. * రూ.12 కోట్లతో 41.43 లక్షల లీటర్ల పాల కొనుగోలుకు టీటీడీ ఆమోదం తెలిపింది * వేద విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది * ఏపీ, తెలంగాణలో టీటీడీ కల్యాణ మండపాల ఆధునికీకరణ * త్వరలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కరెంట్ బుకింగ్ ఏర్పాటుకు నిర్ణయం * బెంగళూరు భక్తురాలు ఇచ్చిన రూ.60 లక్షల విలువైన భవనాన్ని స్వాధీన పర్చుకోవాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News