: బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే... ఇవి తినండి
బెల్లీ ఫ్యాట్... పొట్ట చుట్టూ ఉండే కొవ్వు.. ఇది ఎక్కువైతే, నడుము చుట్టుకొలత పెరిగిపోవడమే కాకుండా, తీరైన ఆకారానికి కూడా దూరమవుతాం. అంతేకాదు, ఆరోగ్య పరంగా పలు సమస్యలు తలెత్తడానికి ఈ బెల్లీ ఫ్యాట్ కారణమవుతుంది. హైపర్ టెన్షన్, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతాయని తాజా అధ్యయనం చెబుతోంది. ఇటీవల ఇంగ్లాండ్ కు చెందిన ప్రజారోగ్య సంస్థ, జర్నల్ హార్ట్ పలు విషయాలను వెల్లడించాయి. బెల్లీ ఫ్యాట్ కారణంగా టైప్-2 డయాబెటీస్ వచ్చే ఆస్కారం, గుండెపోటుతో హఠాన్మరణం సంభవించే అవకాశం ఉందన్న విషయాన్ని స్పష్టం చేశాయి. జన్యుపరమైన కారణాలతో పాటు హార్మోనల్ ఇమ్ బ్యాలెన్స్, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటుూ ఉండటం వల్ల సాధారణంగా బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడాలంటే సూచించిన ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే ఆహార పదార్థాలు... పైనాపిల్, చెర్రీస్, పుచ్చకాయ, అవొకాడో, గ్రీన్ టీ, ఆపిల్స్, ఆల్మండ్స్, బీన్స్, పప్పుదినుసులు, ఆకుకూరలతో పాటు టొమాటోలను మన ఆహారంలో తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ కు చెక్ పెట్టొచ్చు.