: ఉద్యోగుల తరలింపుపై మూడు గడువుల ఆప్షన్లు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం


ఏపీ రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తోంది. తాజాగా ఉద్యోగులు రాజధానికి తరలివెళ్లే విషయంపై ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అందులో మూడు గడువుల ఆప్షన్లు ఇచ్చింది. నవంబర్-2015, ఫిబ్రవరి-2016, జూన్-2016లను పేర్కొంది. వాటి ఆధారంగా ఆప్షన్లు ఇవ్వాలని ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగులు సీఎస్ తో సమావేశమయ్యారు. జూన్ 2లోగా రాజధానికి తరలివెళ్లాలని సీఎస్ వారికి సూచించారు.

  • Loading...

More Telugu News