: మోదీ పాలనలో దేశం ఛిన్నాభిన్నమైంది: ఏకే ఆంటోనీ
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ మండిపడ్డారు. ఒకప్పుడు శాంతిసామరస్యాలతో ప్రపంచానికే తలమానికంలా నిలిచిన భారత్ ఇప్పుడు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. దేశంలోని ప్రజలు ఏం తింటున్నారు? ఏం ధరిస్తున్నారు? ఏం రాస్తున్నారు? అనే విషయాలను ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ముస్లింలు, దళితులపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. దేశంలోకి కొత్తగా పెట్టుబడులు రావడం లేదని, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు.