: తెలంగాణలో కొత్త రహదారి నిర్మాణానికి కేంద్రం అంగీకారం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1350 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. దాంతో పాటు ఏటూరు నాగారం నుంచి కైంటాల వరకూ జాతీయ రహదారిని అభివృద్ధి చేసేందుకు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో డ్రై పోర్టు నిర్మాణంపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ మేరకు ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, నిర్వహణకు సంబంధించి చర్చించారు. అప్పుడే పైన ప్రస్తావించిన వాటికి అనుమతి లభించింది. ఈ సందర్భంగా తెలంగాణలో పర్యటించాలని కేసీఆర్ ఆహ్వానించగా నితిన్ సానుకూలంగా స్పందించారు. త్వరలో రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు.