: విమానం ల్యాండ్ అవుతుండగా గేర్ విరిగింది
బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం పెను ప్రమాదాన్ని తృటిలో తప్పించుకుంది. బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్ బర్గ్ చేరుకుంది. విమానం ల్యాండింగ్ జరుగుతుండగా గేర్ విరిగిపోయింది. దీంతో పైలట్లు అప్రమత్తమయ్యేంతలో విమానం నేలను బలంగా తాకింది. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే నేలను బలంగా తాకడంతో సంభవించిన కుదుపుకి ప్రయాణికులు ఆందోళన చెందారు. ప్రాణభయంతో భీతిల్లిపోయారు. దీంతో వారిని స్లైడర్స్ ద్వారా విమాన సిబ్బంది కిందికి దించారు. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.