: భూకంపం భయంతో కిందకు దూకేసిన యువతి!
హిందూకుష్ పర్వతాల్లో సంభవించిన భూకంపం ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్, నేపాల్ దేశాలను వణికించిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్లో సంభవించిన భూకంపం స్థానికులను బెంబేలెత్తించింది. దీంతో పలువురు ప్రాణభయంతో కంపించిపోయారు. శ్రీనగర్ లోని ఎంఏరోడ్ లోని విమెన్స్ కళాశాల విద్యార్థులు వైవా పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించింది. తరగతి గదుల్లో ఉన్న అమ్మాయిలు బయటకు పరుగులెత్తగా, పై అంతస్తులో ఉన్న యువతులు ఒక్కసారిగా దిగేందుకు తాపత్రయపడ్డారు. ఇంతలో ఓ యువతి ప్రాణభయంతో మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. అయితే, ప్రాణాపాయం లేనప్పటికీ ఆమె గాయాలపాలైంది!