: పదివేల తుపాకులు దొంగిలించాడు!
అతను తుపాకుల దొంగతనం చేయడంలో నిష్ణాతుడు. తుపాకీ నచ్చిదంటే చాలు.. అవతలి వాళ్ల కళ్లు కప్పి, ఆ తుపాకీని మాయం చేసేస్తాడు. ఇంతవరకూ అతను దొంగిలించిన తుపాకుల సంఖ్య ఒకటో, రెండో కాదు, ఎనిమిది నుంచి పదివేల వరకు ఉంది. ఆ తుపాకుల దొంగ పేరు బ్రెంట్ నికోల్సన్. అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఉన్న పేజ్ ల్యాండ్ సిటీలో నివసిస్తాడు. అతని వయస్సు 51 సంవత్సరాలు. ఇప్పటివరకు దొంగిలించిన ఆయుధాలన్నీ తన ఇంట్లో భద్రంగా దాచుకున్నాడు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు, ఆరా తీసేందుకు వెళ్లి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, బ్రెంట్ గ్యారేజ్ లో ఎక్కడ చూసినా తుపాకులే ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకుని, తరలించేదుకు ట్రాక్టర్లను ఉపయోగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మూడు రోజుల పాటు బ్రెంట్ నివాసంలో దాడులు జరిపామన్నారు. తాము స్వాధీనం చేసుకున్న తుపాకుల్లో బ్రెంట్ దొంగిలించినవే ఉన్నాయని, సుమారు ఎనిమిది నుంచి పదివేల తుపాకులు అక్కడ ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.