: తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోంది: మహేందర్ రెడ్డి
నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోల్లో రూ.2.6 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రోజూ 93 లక్షల మందిని తెలంగాణ ఆర్టీసీ గమ్యస్థానాలకు చేరుస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండులను అన్ని విధాలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోందని చెప్పారు. వరంగల్, మెదక్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉనికి కాపాడుకునేందుకే ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొట్టిపారేశారు.