: ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ప్రభాకర్ చౌదరి... దేశం ఎమ్మెల్యేల మధ్య విభేదాలతో ఉద్రిక్తత!


అనంతపురం జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటిపై దాడి చేసేందుకు వస్తున్నారని పుకార్లు రావడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా, ముందు జాగ్రత్త చర్యగా, పోలీసులు చౌదరి ఇంటివద్ద భారీ బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం ప్రతిష్ఠాపన విషయంలో ఇరు నేతల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, తనకెలాంటి బందోబస్తు వద్దని, ఎవరైనా వస్తే తానే ఎదుర్కొంటానని ప్రభాకర్ చౌదరి చెప్పడం గమనార్హం. తానెవరికీ భయపడబోనని, తక్షణం వెళ్లిపోవాలని పోలీసులకు ఆయన స్పష్టం చేశారు. పోలీసులు మాత్రం ఇంకా చౌదరి నివాసాన్ని వదిలి వెళ్లలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News