: ఇండిగోలో వాటాల కోసం ఎగబడ్డ విదేశీయులు... క్యూఐబీ కోటా పూర్తి


సుమారు రూ. 3 వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణ లక్ష్యంగా ఈ ఉదయం ఐపీఓకు వచ్చిన ఇండిగో వాటాలను సొంతం చేసుకునేందుకు విదేశీయులు ఎగబడ్డారు. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బిడ్డింగ్ (క్యూఐబీ) పద్ధతిలో రిజర్వ్ చేసిన వాటాలు తొలి గంట వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రయిబ్ అయ్యాయి. మొత్తం 85,22,935 వాటాలను ఈ విధానంలో విక్రయానికి ఉంచగా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 97,45,590 వాటాల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఇక సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోసం 58.19 లక్షల వాటాలను అందుబాటులో ఉంచగా, మధ్యాహ్నానికి 3,545 వాటాలకు, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 1.35 కోట్ల వాటాలను కేటాయించగా, 70,425 వాటాలకు బిడ్లు దాఖలయ్యాయి. భారత విమానయాన రంగంలో 35.3 శాతం మార్కెట్ వాటాతో దూసుకెళ్తున్న సంస్థ వాటాలన్నీ రేపటికి అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News