: చంద్రబాబు సర్కారుకు అమరావతి దెయ్యం పట్టింది: ‘సీమ’ నేత బైరెడ్డి ఘాటు విమర్శ
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి అమరావతి దెయ్యం పట్టిందని ఆయన కొద్దిసేపటి క్రితం కర్నూలులో వ్యాఖ్యానించారు. 13 జిల్లాలున్న ఏపీకి 2 లక్షల ఎకరాలున్న రాజధాని అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ ఆదేశాలను పాటించకుండా చంద్రబాబు సర్కారు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిందని కూడా ఆయన ఆరోపించారు. సర్కారు తీరుపై పిల్ దాఖలు చేసిన వ్యక్తిని మభ్యపెట్టి లోబర్చుకునేందుకు చంద్రబాబు కేబినెట్ యత్నించిందని కూడా బైరెడ్డి దుయ్యబట్టారు. అమరావతి శంకుస్థాపన దినం (అక్టోబరు 22) ఏపీ ప్రజలకు బ్లాక్ డే అని బైరెడ్డి వ్యాఖ్యానించారు.