: హార్దిక్ పటేల్ కు హైకోర్టులో చుక్కెదురు
తమ సామాజికవర్గాన్ని ఓబీసీల్లో చేర్చాలంటూ భారీ ఉద్యమానికి నాంది పలికిన పటేళ్ల యువనేత హార్దిక్ పటేల్ కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. హార్దిక్ పై నమోదైన రాజద్రోహం కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. సమాజంలో హింసను రేకెత్తించే హక్కు ఏ ఒక్కరికీ లేదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 'మన రిజర్వేషన్ల కోసం మనం చేపట్టిన ఉద్యమంలో మనమెవరూ చనిపోవద్దు... అవసరమైతే ఇద్దరు ముగ్గురు పోలీసులను కాల్చి చంపేయండి' అంటూ హార్దిక్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇతనిపై రాజద్రోహం కేసు నమోదైంది.